మోడీతో జగన్ ఏం చర్చించారంటే ?

ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్‌.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి జగన్‌ వినతి పత్రం అందించారు.

విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. మౌలిక సదుపాయాలను కోల్పోయాం. వాటి కోసం భారీగా ఖర్చు చేశాం. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతో పాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. కానీ, చాలా హామీలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని జగన్ గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా.. కేవలం 45 శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందన్నారు. 2015-16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454గా ఉంటే.. ఏపీలో రూ.8,979 మాత్రమే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2,100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది.