బాలయ్య విలన్ గా కన్నడ స్టార్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య విలన్ గా బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. శిల్పాశెట్టితో పాటు మరికొందరు బాలీవుడ్ నటీనటులు బాలయ్య సినిమాలో కనిపించనున్నారనే వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పుడు బాలయ్య విలన్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ ను ఎంపిక చేశారు. ఇక ఈవిషయాన్ని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో ‘దునియా’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్. దాంతో దునియాని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. దునియా విజయ్ గా కన్నడ తెరను ఏలుతున్నాడు.

ఇక #NBK107 లో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.