కేటీఆర్ మైకంలో జగ్గారెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ టాపిక్ గా మారారు. గత కొన్నాళ్లుగా ఆయన ప్రతిరోజు హెడ్ లైన్స్ లో ఉంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా, లేదంటే ఆయనపై టీఆర్ఎస్ కోవర్టు, కేటీఆర్ మైకంలో ఉన్నారనే వార్తల ద్వారా ఫోకస్ లోకి వస్తున్నారు.

నిజంగానే జగ్గారెడ్డికి కేటీఆర్ ఆఫర్ చేశారా ? హరీష్ రావుని టార్గెట్ చేయమని, తెలంగాణ కాంగ్రెస్ ను వీలైనంత వరకు డ్యామేజ్ చేయమని టాస్క్ లు ఇచ్చారా ? అనే విషయాల్లో ఏమాత్రం నిజాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.. జగ్గూభాయ్ తీరు మాత్రం అదే విధంగా ఉంది. ఒకప్పటిలా ఆయన కేసీఆర్, కేటీఆర్ లను తిట్టడం లేదు. ఎప్పడూ లేనిధి ఆయన స్వపక్షంలోనే విపక్షంలా మారాడు. ఇవన్నీ దేనికి సంకేతం ? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. త్వరలోనే ఆయన హస్తానికి హ్యాండిచ్చి.. కారెక్కనున్నారు. కేటీఆర్ ప్యాకేజీలో మంచి పదవి కొట్టబోతున్నారని అంచనా వేస్తున్నది.

దానినే సోషల్ మీడియా,ఇతర మాధ్యమాల వ్యక్తం పరిస్తుంది. దానిని జగ్గారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియాపై ఎగిసిపడుతున్నడు. పొలిటికల్ వ్యూహాల్లో భాగంగా రాజకీయ నాయకుడు ఏమైనా చేసుకోవచ్చు. కానీ.. ఆయనపై మాటలు అన్నా.. రాసిన తట్టుకోకపోవడం మంచిది కాదేమో.. ! సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జగ్గూభాయ్ కి ఇవన్నీ తెలియని కావనుకోండీ.. !