బాలీవుడ్ లో మరో ముగ్గురికి కరోనా

కరోనా బారిన పడుతున్న బాలీవుడ్ సెలబ్రెటీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు సినీతారలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అవుతోంది. సోమవారం స్టార్ కపూల్స్ జాన్ అబ్రహాం-ప్రియా రూంచల్ లకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వీరిద్దరు హోం అసోలేషన్ లోకి వెళ్లినట్టు ప్రకటించారు.

ఇటీవల తమని కలిసివారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమెని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే కరీనా కపూర్, అమృతా అరోరా, అర్జున్ కపూర్, శిల్పా శిరోద్కర్, నోరా ఫతేహి, మృణాల్ ఠాకూర్ లాంటి సెలెబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు కోలుకోగా.. మరికొందరు ఇంకా అసోలేషన్ లోనే ఉన్నారు.