అఫీషియల్ : ‘రాధేశ్యామ్’ రిలీజ్ వాయిదా

సినీ పరిశ్రమపై మరోసారి కరోనా దెబ్బ పడింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే దారిలో రాధేశ్యామ్ కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనిపై ఏక్షణంలోనైనా రాధేశ్యామ్ టీమ్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు సంక్రాంతి బరిలో ఉన్న అజిత్ ‘వాలిమై’ మాత్రం రిలీజ్ కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో వాలిమై చిత్రబృందం కూడా ఫైనల్ డిసిషన్ తీసుకోనుంది.

మరోవైపు వాయిదా పడిన పెద్ద చిత్రాల స్థానాన్ని చిన్ని సినిమాలు బర్తీ చేస్తున్నాయి. దాదాపు ఏడెనిమిది చిన్ని సినిమాలు సంక్రాంతి రిలీజ్ డేట్స్ ప్రకటించుకున్నాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు లేని లోటు ఈ సంక్రాంతికి స్పష్టంగా కనిపించనుంది.