రెజీనా మరో సిల్క్

ఇండియన్ సినిమా తెరపై సిల్క్ స్మిత సింగిల్ పీస్. ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కానీ ఆమెని గుర్తు చేసినవారు కొందరు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో మొదట వినిపించే పేరు బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్.

సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన ‘డర్టీ పిక్చర్’లో సిల్క్ పాత్రలో విద్యా మెరిసింది. సిల్క్ ని మైమరిపిస్తూ.. పాత్రలో లీనమైపోయింది. దానికి ఆమెకు ప్రతిఫలం కూడా దక్కింది. జాతీయ అవార్డ్ వరిచింది.

ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రక్కన సిల్స్ స్టెప్పులేస్తే ఆ మజానే వేరేలా ఉండేది. ఇప్పుడీ.. ఈలోటును యంగ్ హీరోయిన్ రెజీనా తీర్చేసింది. చిరు లెటెస్ట్ చిత్రం ఆచార్య ఐటమ్ సాంగ్ లో రెజీనా స్టెప్పులేసింది. ఆదివారం ఈ సాంగ్ ప్రోమోను, కొద్దిసేపటి క్రితమే పూర్తి సాంగ్ ని విడుదల చేశారు.

ఇక ఈ సాంగ్ లో మెగాస్టార్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే ఆయనకు ధీటుగా రెజీనా కూడా కాళ్లు కదిపింది. అంతేకాదు.. ఈ సాంగ్ లో రెజీనా సిల్క్ ని గుర్తు చేసింది. ఆమె మేకోవర్, సాంగ్ లో ఆమె ఎంట్రీ.. ఎక్స్ ప్రెషన్స్ లో అన్నింటీలోనూ సిల్క్ ని తలపించింది. క్లీవేజ్ షో, నడుం మడటలు ఎక్స్ ట్రా డోస్ అన్నట్టుగా ఉన్నాయి. గ్లామర్ విషయం పక్కనపెడితే.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో సిల్స్ దిగొచ్చిందా ? అన్నట్టుగా ఉన్నాయి. ఇకపై స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్ కు రెజీనా బెస్ట్ ఆప్షన్ గా మారనుంది.

దేవాదాయ శాఖ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాను కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదలకానుంది.