‘వాలిమై’ తెలుగు, హిందీ ట్రైలర్స్ ఎప్పుడంటే ?

కోలీవుడ్‌ స్టార్ అజిత్‌ తాజా చిత్రం ‘వాలిమై’. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన చిత్రబృందం సరికొత్త పోస్టర్స్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

అయితే కేవలం తమిళవర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. దీంతో వాలిమై తెలుగు, హిందీ ట్రైలర్స్ ఎప్పుడు ? అంటూ అభిమానులు అడుగుతున్నారు. దీనిపై తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.

ఈ వారంలోనే వాలిమై తెలుగు, హిందీ ట్రైలర్ ని విడుదల చేయనున్నారని తెలిసింది. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ , రాధేశ్యామ్ చిత్రాల దారిలో వాలిమై రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.