ఓటీటీలోకి ‘బంగార్రాజు’.. క్లారిటీ వచ్చేసింది !
కరోనా ఎఫెక్ట్ తో జనవరి 7న రావాల్సిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకుంటూ.. బంగార్రాజు తో పాటు పలు చిన్న సినిమాలు సంక్రాంతి బరిలోకి దూకాయి. అయితే ఇప్పుడు బంగార్రాజు’ ఓటీటీలో విడుదలవుతుందని కొందరు అంటుంటే, 14 రోజుల థియేటర్ ప్రదర్శన తర్వాత ఫలానా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ మరికొందరు పోస్ట్‌లు పెడుతున్నారు.
తాజాగా ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ ‘జీ 5’ తాజాగా స్పందించింది. ‘బంగార్రాజు’ చిత్ర విడుదలపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అభిమానులు ఆశించినట్టుగానే ఈ సినిమాను కొవిడ్ నిబంధలను పాటిస్తూ థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇక ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు రూపొందింది. . కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.