అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ విడుదల వాయిదా

కరోనా ఎఫెక్ట్ తో మరో సినిమా వాయిదా పడింది. చంద్రప్రకాష్ త్రివేది దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనూసూద్, మనూష్ చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పృధ్వీరాజ్’. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. జనవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పృధ్వీరాజ్ ని వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ని యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా ప్రకటించలేదు.

దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్ మూతపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో థియేటర్స్ ని పూర్తిగా మూసేశారు. ముంబైలో 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే రన్ అవుతున్నాయి. మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది. ఇదే దారిలో మరికొన్ని సినిమాలు రిలీజ్ డేటును వాయిదా వేసుకుంటున్నాయి.