అమెజాన్ ప్రైమ్ లో ‘పుష్ప’.. ఎప్పటి నుంచి అంటే ?

తెలుగు సినిమా సత్తా ఏంటో ‘పుష్ప’ పుష్ప చూపిస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ అదరగొడుతున్నాడు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను మించి కలెక్షన్స్ రాబడుతున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ లో పుష్ప కలెక్షన్స్ రూ. 75కోట్లకి చేరువవుతున్నాయి. ఇక అన్ని చోట్లా కలెక్షన్స్ కలిపితే.. రూ. 300కోట్లు దాటేశాయి.

మరోవైపు పుష్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్టు తెలుస్తున్నది. అమెజాన్ ప్రైమ్ పుష్పను భారీ రేటు పెట్టి కొనుకున్నది. సంక్రాంతి కానుకగా ఈ నెల 7 నుంచి పుష్ప స్ట్రీమింగ్ కానుందని తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. బన్నీకి జంటగా రష్మిక మందన నటించింది. ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత మెరిసింది. మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించారు. సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వందల కోట్లు కొల్లగొడుతున్నది.