సామ్ క్యాలెండర్

స్టార్ హీరోయిన్ సమంత క్యాలెండర్ వచ్చేసింది. పింక్ కలర్ డ్రెస్ లో కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు. అయితే ఇది ఫ్యాన్ మేడ్ క్యాలెండర్ లా కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది సామ్ సినిమా క్యాలెండర్ విషయానికొస్తే.. దాదాపు అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇప్పటికే శాకుంతలం సినిమాని పూర్తి చేసింది. యశోధ సినిమాని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లింది. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు.. ఒకట్రెండు బాలీవుడ్ సినిమాలు, కోలీవుడ్ సినిమాలను లైన్ లో పెట్టేసింది.

సినిమాలే కాదు.. యాడ్స్ ని సామ్ వదలడం లేదు. తాజాగా సామ్ ఖాతాలో మరో యాడ్ వచ్చి చేరింది. #VatikaHairOil ని సామ్ ప్రమోట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యాడ్ లో సామ్ మరింత అందంగా, క్యూట్ గా కనిపిస్తున్నది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె అందం డబుల్ అయిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.

