‘వాలిమై’ వాయిదా లేదు.. రేపే హిందీ ట్రైలర్ !
కరోనా ఎఫెక్ట్ తో సంక్రాంతి సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. అదే దారిలో ప్రభాస్ రాధేశ్యామ్, అజిత్ ‘వాలిమై’ సినిమాలు కూడా వాయిదా పడతాయనే ప్రచారం జరుగుతున్నది. అయితే అలాంటిదేమీ లేదని వాలిమై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
ముందుగా ప్రకటించిన డేటు జనవరి 13నే వాలిమై ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టత ఇచ్చింది. రిలీజ్ డేటుతో కూడిన పోస్టర్స్ ని కూడా విడుదల చేస్తున్నారు. అంతేకాదు.. వాలిమై హిందీ, తెలుగు ట్రైలర్స్ ని రేపు విడుదల చేయనున్నట్టు ఎనౌన్స్ చేసింది.
మరోవైపు రాధేశ్యామ్ కూడా వాయిదా పడటం లేదని తెలుస్తున్నది. సంక్రాంతి కానుకగా జనవరి 14నే విడుదల కానుందని తెలుస్తున్నది. మరోవైపు ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి థియేట్రికల్ మరియు ఓటీటీ రిలీజ్ పై రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిపై రేపటి లోగా క్లారిటీ వచ్చే అవకాసాలు ఉన్నాయి.