రెండో టెస్ట్ : దక్షిణాఫ్రికా టార్గెట్ 240

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది. దీంతో 239 పరుగుల ఆధిక్యం సాధించి.. దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అజింక్య రహానె (58), ఛెతేశ్వర్‌ పుజారా (53) అర్ధశతకాలు సాధించగా.. హనుమ విహారి (40*) శార్దూల్‌ ఠాకూర్ (28) రాణించారు. మిగతావారిలో కేఎల్ రాహుల్ 6, మయాంక్‌ అగర్వాల్ 23, రిషభ్‌ పంత్ డకౌట్, అశ్విన్‌ 16 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 3, రబాడ 3, ఎంగిడి 3, అలివీర్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఇక, 240 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా టీ బ్రేక్ టైమ్ కి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. అయితే విజయావకాశాలు రెండో జట్లకు సమానంగా ఉన్నాయి. పేస్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా పేస్ దళం విజృభిస్తే.. విజయం అసాధ్యమేమీ కాదు. మరోవైపు పట్టుదలగా ఆడితే దక్షిణాఫ్రికా గెలుపును ముద్దాడే ఛాన్స్ ఉంది.