అఫీషియల్ : 7న పుష్ప ఓటీటీ రిలీజ్

థియేటర్స్ లో అదరగొట్టిన పుష్పరాజ్ సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. ‘పుష్ప’ సినిమా ఓటీటీ రిలీజ్ ఖరారైంది. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒక్క హిందీ తప్ప.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో అందుబాటులో ఉందనుంది. హిందీలో పుష్ప కలెక్షన్స్ ఇప్పటికీ బాగున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ పుష్పను ఇప్పుడే ఓటీటీకి ఇచ్చేందుకు అంగీకరించలేదు.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఇది. బన్నీకి జంటగా రష్మిక మందన నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసింది. మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించారు. ఎర్రచందన్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప అల్లు అర్జున్ జీవించేశారు.