బొమ్మలా.. బుజ్జి మా.. !

ముంబై భామ సీరత్ కపూర్ ‘రన్ రాజా రన్’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆమెను చూడగానే బుజ్జిమా.. బుజ్జిమా అని పాడుకొనే చేసింది. మెరుపుతీగలా కనిపించే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు.

కానీ ఒక్క మాస్ మహారాజా రవితేజ తప్ప.. మరో స్టార్ హీరో ఈ బ్యూటీని పట్టించుకోలేదు. టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో సీరత్ హీరోయిన్ గా చేసింది. ఇవీగాక.. రాజుగారి గది 2, ఒక్క క్షణం, కోలంబస్, కృష్ణ అండ్ హిజ్ లీలా, మన వింత గాధ వినుమా.. తదితర సినిమాల్లో నటించింది. అడపాదడపా సినిమాలు చేయడమే.. కానీ బిజీ హీరోయిన్ గా మారడం లేదు ఈ బ్యూటీ.

అయితే సినిమాలు లేకున్నా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో డ్రెస్ లో బొమ్మలా రెడీ అయిపోయి పోజులిచ్చింది. ఉంగరాల జుట్టుతో మలయాళ బ్యూటీ అనుమప పరమేశ్వర్ ను గుర్తు చేసింది.

ఆమె ఫోటోను చూసిన నెటిజన్స్.. డాలీ, ఎల్లో బొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు.. ఈ బ్యూటీ మల్టీ టాలెంటెడ్. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్.. మోడల్ కూడా.