ఊ.. రౌడీ బేబీ రికార్డ్ బద్దలు !

సినిమా లెక్కలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఎన్నిరోజుల లెక్కలు ఎప్పుడో పోయాయ్. ఎన్ని కోట్ల కలెక్షన్స్.. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ లెక్కెంత కాలం వచ్చేసింది. అదే సమయంలో పాటలు, అవి దక్కించుకున్న లైక్స్, షేర్స్.. వ్యూస్ ను లెక్క పెట్టుకుంటున్నారు. రికార్డుల లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్-సాయి పల్లవి నటించిన తమిళ చిత్రం ‘మారి2’లోని రౌడీ బేబీ టన్నుల కొద్ది రికార్డులను ఖాతాలో వేసుకుంది. రౌడీ బేబీ వీడియో సాంగ్ రిలీజైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇప్పుడీ.. ఈ రికార్డుని పుష్ప ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా ? ఊ ఊ అంటావా మావా ? క్రాస్ చేసింది. కేవలం 16 గంటల్లోనే పుష్ప ఐటమ్ 9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాటను చంద్రబోస్ రాశారు. ఇంద్రావతి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట స్టార్ హీరోయిన్ సమంత అదరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. అన్నీ కలిపి.. ఊ అంటావా మావా ? మస్త్ హిట్ అయినది. ఏకంగా రౌడీ బేబీ రికార్డ్స్ నే క్రాస్ చేసింది. ఇక రౌడీ బేబీ ఇప్పటి వరకు 1300మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ఐటమ్ సాంగ్ కూడా లాంగ్ రన్ లో ఆ రేంజ్ వ్యూస్ సొంతం చేసుకోవడం ఖాయం. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించారు. సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక శుక్రవారం నుంచి పుష్ప ఓటీటీలోనూ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నది. థియేటర్స్ లెక్కల ప్రకారం పుష్ప ఇప్పటికే రూ. 300కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లోనే పుష్ప దాదాపు రూ. 70కోట్లు రాబట్టింది.