కేసీఆర్ తో కేరళ సీఎం లంచ్ భేటీ

హైదరాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేరళ సీఎం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ సీఎం విజయన్‌ను శనివారం సీఎం కేసీఆర్ లంచ్ కు ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో సీఎంలు ఇద్దరు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై చిన్నపాటి చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం థర్డ్ ఫ్రంట్ పై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో విజయన్-కేసీఆర్ ల కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.