కట్టప్పకు కరోనా.. ఆసుపత్రికి తరలింపు

రోజులు గడుస్తున్న కొద్ది కరోనా తన విశ్వరూపం చూపిస్తుంది. ఇప్పటికే దీని వల్ల చాలా మంది మరణించారు. ప్రస్తుతం టాలివుడ్ ను ఒక ఊపు ఊపుతుంది కరోనా. తాజాగా బాహుబలి సినిమాలో కట్టప్ప అయిన, సత్యరాజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో,అప్పిటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నాడు.

గత రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో ఆయనను చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కరోనా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సత్యరాజ్ తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే హీరో మహేష్ బాబు, థమన, విశ్వక్ సేన్, మంచు లక్ష్మీ, మీనా, త్రిషా తో పాటు చాలా మంది నటీనటులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.