KGF2 ఆ డేటు నుంచి కదిలేదేలే..

తగ్గేదేలే.. అంటూ బాక్సాఫీసును కొల్లగొడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరోవైపు ఎప్రిల్ 14 డేటు నుంచి కదిలేదేలే అంటున్నాడు కన్నడ స్టార్ యష్. ఆయన నటించిన కేజీఎఫ్ 2 ఇప్పటికే రిలీజ్ కావాల్సింది.

కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ ల నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈరోజు యశ్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ 2 రిలీజ్ డేటుపై మరోసారి క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డేటు నుంచి కదిలేదు లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ తెరకెక్కింది.  బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కేజీఎఫ్ రికార్డ్ సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు.. కేజీఎఫ్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఏప్రిల్ 14న రిలీజ్ పక్కా అంటూ స్పష్టత ఇచ్చింది.