గ్యాప్ దొరికితే.. అదే పనిలో పూజా !

పూజా హెగ్డే – స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. వరుసగా స్టార్ హీరోయిన్స్ తో జతకడుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది.. ఈ ముద్దుగుమ్మ.

గత ఒకట్రెండు ఏళ్లుగా అస్సలు రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొంది. అయితే గత ఏడాది ఆఖరులో ఈ బ్యూటీకి విశ్రాంతి వచ్చింది. దీంతో మాల్దీవుల్లో వాలిపోయి చిల్ అయి వచ్చింది. అయితే ఇప్పుడు దేశంలో మరోసారి కరోనా విజృంభణతో షూటింగ్స్ కి బ్రేక్ పడ్డాయి. దీంతో వచ్చిన ఖాళీ సమయాన్ని పూజా బాగా వాడుకుంటోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నది.

అంతేకాదు.. వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరితో చిట్ చాట్ చేస్తుంది. దానికి సంబంధించిన పిక్ ని కూడా షేర్ చేసింది. అయితే అవతల వ్యక్తి మాత్రం కనిపించడం లేదు. కేవలం పూజా,ఆమె మొహంలో ఆనందం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడనే కాదు.. ఎప్పుడు షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికినా. . పూజా ఇలాగే ఎంజాయ్ చేస్తుంటుందని టాక్.