పుష్ప పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు

పుష్ప క్రేజ్ మాములుగా లేదు. పుష్ప పాటలు హాలీవుడ్ లో ఫేమస్ అయిపోయాయి. పుష్పలోని సామి.. సామి  పాటకు స్పైడర్‌ మ్యాన్‌ కూడా ఫిదా అయిపోయాడు.. రారా సామీ అంటూ స్పైడర్‌ మ్యాన్‌ చేస్తున్న డ్యాన్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.  క్రిస్మస్‌ సెలబ్రెషన్స్‌లో భాగంగా స్పైడర్‌ మ్యాన్‌ వేషంలో ఉన్న వ్యక్తి రారా సామీ పాటకు డ్యాన్స్‌ చేస్తుంటే.. ఎదురుగా క్రిస్మస్‌ సంటా వేషంలో ఉన్న వ్యక్తులు అతడిని అనుసరిస్తూ ఈపాటకు డ్యాన్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 ఇక ‘ఊ అంటావా మావా..  ఊఊ అంటావా’ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దీనికి ముందు విడుదలైన ‘రారా సామీ’ పాటకు కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ జాబితా చేరింది. ఎక్క డ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఇక ఈ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ సోషల్‌ మీడియాలో పలువురు వీడియోలు కూడా షేర్‌ చేస్తున్నారు.