శృతి సరసం.. ఛాలెంజ్ !
హీరోయిన్ శృతిహాసన్ ప్రియుడు శాంతాను హజారికాతో సరసంగా ఆడిన ఛాలెంజ్ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఛాలెంజ్ లో భాగంగా అడిగిన మొదటి ప్రశ్న మొదట ఎవరు ఆసక్తి చూపించారు ? అనే ప్రశ్నకు శృతి శాంతాను చూపించింది. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు ? అన్న ప్రశ్నకు తానేనని ఒప్పేసుకుంది. ఎవరు కేరింగ్ ఉంటారు ? అన్న ప్రశ్నకు ఇద్దరు తల ఊపారు. ఎవరు ఎక్కువగా శుభ్రంగా ఉంటారు ? అనే ప్రశ్నకు వన్ సైడ్ గా శృటికే ఓటు పడింది.
ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు ? అనే ప్రశ్నకు.. ఇద్దరు తామేనని అంగీకరించారు. ఎవరు వాగ్వాదానికి దిగుతారు ? అనే ప్రశ్నకు శృతి శాంతాను చూపించింది. అతడు కూడా చేసేదేమీ లేక అంగీకరించాడు. ఎవరు ముందుగా నిద్రపోతారు ? అనే ప్రశ్నకు శాంతాను చూపించింది శృతి. అతడు నవ్వేశాడు. అంగీకరించాడు. ఎవరు ఎక్కువ కోపం తెప్పిస్తారు ? అనే ప్రశ్నతో ఛాలెంజ్ ముగిసింది. దీనికి సమాధానం తెలియాలంటే కింద ఉన్న వీడియో చూసి తెలుసుకోండి.. !