జూనియర్ పవర్ స్టార్ కి కరోనా
థర్డ్ వేవ్ లో కరోనా బారిన పడుతున్న సెలబ్రెటీలు, వారి కుటుంబాల జాబితా పెరుగుతుంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరానంద్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ నే అభిమానులతో పంచుకుంది. కొడుకుతో పాటుగా తనకు పాజిటివ్ గా వచ్చిందని ఆమె తెలిపారు.
తనకు ఇప్పటికే రెండు డోస్‌ల వ్యాక్సిన్ వచ్చిందని, మళ్లీ పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. సరైన టీకా కోసం అకీరాను పరిగణించకముందే నివేదిక పాజిటివ్‌గా ఉందని రేణు దేశాయ్ అన్నారు. రేణు, అకీరాలకు కరోనా సోకడంపై పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వారిద్దరు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక అకీరాకి కరోనా పాజిటివ్ రావడంపై పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు.