మామిడి తోటకెళ్లి మాట్లాడుకుందామా ?

యంగ్ హీరోయిన్ కృతిశెట్టి యమా స్పీడు మీదుంది. మామిడి తోటకెళ్లి మాట్లాడుకుందామా ? అంటూ హీరో నాగ చైతన్యకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ చైతూ ఏ మేరకు వాడుకున్నాడు ? తెలియాలంటే బంగార్రాజు సినిమా చూడాల్సిందే. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో నాగ్, చైతూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బంగార్రాజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సేమ్ టు సేమ్ సోగ్గాడే ఫ్రేమ్ లో బంగార్రాజు కనిపించాడు. ఒక్కటే తేడా.. సోగ్గాడేలో నాగ్ కనిపించిన తరహా పాత్రలో చైతూ కనిపించాడు. చైతూ చిలిపి చేష్టలు బాగానే ఉన్నాయి. అలాంటి చైతూకే మామిడి తోటెకెళ్లి మాట్లాడుకుందామా ? అంటూ కృతి ఆపర్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్. మరోవైపు యాక్షన్ సీన్స్, దైవం.. అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.