‘హీరో’లో కృష్ణ, మహేష్.. ఆ స్పెషల్ సీన్ అదుర్స్ !

గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘హీరో’. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రం సంక్రాంతి కానుక‌గా… జ‌న‌వ‌రి 15న వ‌స్తోంది. హీరోలో అశోక్ కౌబోయ్ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు.

కౌబోయ్ అంటే… ముందు గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ‌. తెలుగులో ‘కౌబోయ్’ ఆయన కేరాఫ్ అడ్రస్. ‘ట‌క్క‌రి దొంగ‌’లో మ‌హేష్ కూడా కౌబోయ్ గా క‌నిపించాడు. ఆ గెట‌ప్ మ‌హేష్‌కీ మ‌హ బాగా సూట్ అయ్యింది. ఇప్పుడు ఇదే గెట‌ప్ లో అశోక్ క‌నిపించబోతున్నాడు. 

హీరో సినిమాలో, ఈ హీరోని కౌబోయ్ గెట‌ప్ లోనే ఇంట్ర‌డ్యూస్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ఇదే సీన్‌లో.. కృష్ణ‌, మ‌హేష్‌లు కూడా కౌబోయ్ గెట‌ప్పుల్లో క‌నిపిస్తారు. దాన్ని గ్రాఫిక్స్ ద్వారా యాడ్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు. అలా.. ఈ ముగ్గురినీ ఒకేసారి కౌబోయ్ గెట‌ప్పుల్లో చూడ‌డం ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఉంటుంద‌ని శ్రీ‌రామ్ ఆదిత్య భావిస్తున్నాడు. అందుకే ఈ సినిమా మొదటి పది నిమిషాలు ఎవ్వరూ మిస్ కావొద్దు. సప్రైజ్ ఉంటుందని చిత్రబృందం అందుకే ఊరిస్తున్నది.