ఇప్పుడు.. చేయకూడని పని చేస్తున్న కృతి !
‘ఉప్పెన’ హీరోయిన్ కృతిశెట్టికి సినిమా ఆఫర్లు అలల్లా వచ్చి పడుతున్నాయి. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’తో మెరిసింది. ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’లోనూ సందడి చేయబోతోంది. సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో పాటుగా రామ్ తో ఓ సినిమా చేస్తోంది.
ఇప్పుడు ఏకంగా మెగా బ్యానర్ లో ఆఫర్ కొట్టేసినట్టు సమాచారం. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన బ్యానర్లో కొత్త కొత్త సినిమాలు రూపొందనున్నాయి. ఈ క్రమంలో ‘ఉయ్యాల జంపాల’ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నది. ఇదో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఇందులో ప్రధాన పాత్ర కోసం కృతిశెట్టిని తీసుకున్నారు.
నిజానికి ఏ స్టార్ హీరోయిన్ అయినా, కెరీర్లో ఓ దశకు చేరుకున్నాకే, లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటించడానికి మొగ్గు చూపిస్తుంటారు. కానీ కృతి మాత్రం ఇప్పుడు.. ఈ వయసులో చేయకూడని పని చేస్తుంది.
అయితే ఇదేం సీరియస్ డ్రామా కాదని, ఈతరం అమ్మాయిలాంటి పాత్రలోనే కృతి కనిపించబతోందని, అందుకే ఈ సినిమా ఒప్పుకుందని టాక్. మరోవైపు ఈ అమ్మయి తెర వెనక వ్యవహారాలు మాములుగాలేవ్. అందుకే వరుస ఆఫర్లు అందుకుంటుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.