బీజేపీ ప్రత్యర్థులను ఏకం చేస్తున్న కేసీఆర్ ?

బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు ప్రగతి భవన్ గేట్లు బోర్లా తెరచుకుంటున్నయి. ఇటీవలే కేరళ పిన‌ర‌యి విజ‌య‌న్ ప్రగతి భవన్ లో విందు ఆరగించారు. కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా పని చేయడం.. కూటమి కట్టడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్టు తెలిసింది.

ఇక ఈరోజు ఆర్జేడీ నేత, బీహార్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ తెలంగాణ‌కు వ‌చ్చారు. తేజ‌స్వీ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ ప్ర‌తినిధుల బృందం సీఎం కేసీఆర్ తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. వారిని మంత్రి కేటీఆర్ స్వయంగా ఆహ్వానించారు.  దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

ఇటీవల సీఎం కేసీఆర్ కుటుంబం తమిళనాడుకు వెళ్లి.. చెన్నైలో సీఎం స్టాలిన్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి కోసం స్టాలిన్ మద్దతు అడిగినట్టు తెలిసింది. అయితే స్టాలిన్ మాత్రం కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి.. బీజేపీ వ్యతిరేక వర్గాలను ఏకం చేయడంలో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తున్నది.