రైతుల ఆదాయం డబుల్ చేస్తమన్నరు.. గిదేందీ మరీ.. ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇందులో ఎరువుల ధరలను పెంచడాన్ని వ్యతిరేకించారు. వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని విజ్ఝప్తి చేసారు. 2022కల్లా రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని గొప్పలు చెప్పి.. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం ఆరు సంవత్సరాలలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నదని, ఈ విషయాన్ని ఫిబ్రవరి 2016లో ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిన నిర్దిష్ట నిర్మాణత్మక కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఐదు ఏళ్లల్లో ఇన్పుట్ ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ఎరువు ధరలు కళ్ళకు కడుతున్నయన్నారు. మ్యురియేట్ ఆఫ్ ఫోటాస్ ధరలు 50 శాతం, 100 శాతం కంటే ఎక్కువ పెరగడం విచారకరమని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.