ముదురు-లేత బంధం ముగిసిందా ?

 బాలీవుడ్ లో ముదురు-లేత బంధం ముగిసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 48 ఏళ్ల హాట్ బ్యూటీ మలైకా అరోరా, 36 ఏళ్ల యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. భర్తతో విడిపోక ముందు నుంచే అర్జున్ కపూర్ తో యవ్వారం నడిపింది.. ఈ బ్యూటీ. ఇక విడాకుల తర్వాత ఓపెన్ గా ప్రోసీడ్ అయింది.

పార్టీలు-పబ్బులు, విహార యాత్రలు అంటూ.. బాగానే చక్కర్లు కొట్టేది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ జంట మాల్దీవుల్లో వాలిపోయి. మస్త్ గా ఎంజాయ్ చేసింది. అయితే అక్కడికి వెళ్లేటప్పుడు జంటగా వెళ్లిన వీరిద్దరు.. వచ్చే టప్పుడు మాత్రం ఒంటరి పక్షులుగా వచ్చారట.

ఇండియాకు వచ్చిన తర్వాత ఎవ్వరికీ వారే బతుకుతున్నారట. వీరిద్దరు కలుసుకోక.. దాదాపు డజను రోజులు అయ్యాయి. అంతేకాదు.. ఈ జంట విడిపోవాలని డిసైడ్ అయింది. అతి త్వరలోనే బ్రేకప్ ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం.