సామ్ తో బ్రేకప్ బెస్ట్ డెసిషన్.. ఎలా అంటే ?
నాగ చైతన్యతో విడాకుల వ్యవహారంపై సమంత రెండు, మూడు సార్లు స్పందించింది. తన ప్రైవసీని గౌరవించాలని కోరింది. చైతూ మాత్రం ఇప్పటి వరకు నోరు తెరవలేదు. బ్రేకప్ రిజన్స్ చెప్పకుండానే లవ్ స్టోరీ ప్రమోషన్స్ చేసుకొని.. బయటపడిపోయారు. కానీ బంగార్రాజు ప్రమోషన్స్ లో మాత్రం సామ్ తో బ్రేకప్ పై స్పందించారు.
తమ మంచి కోసం తాము తీసుకున్న బెస్ట్ డెసిషన్ గా ఈ విడాకుల్ని చెప్పుకొచ్చాడు. “మా ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అది. తను సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నాను. మేమున్న పరిస్థితుల్లో ఇదే బెస్ట్ డెసిషన్. కలిసి నిర్ణయం తీసుకున్నాం.” అని లాజిక్ గా చెప్పారు. చైతూ నోరు విప్పాడు కాబట్టి.. ఇప్పుడు సామ్ నుంచి అసలు నిజాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.