అన్నయ్యను పిలిచి తమ్ముణ్ని పలచన
సినీ పెద్దగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవికి పెద్దపీఠ వేశారు ఏపీ సీఎం జగన్. స్వయంగా ఫోన్ చేసి.. రమ్మని ఆహ్వానించాడు. స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు చేరుకొని.. అక్కడి నుంచి తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన మెగాస్టార్ కు ఘన స్వాగతం లభించింది.
స్వయంగా సీఎం జగన్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. స్వయంగా సీఎం సతీమణి భారతీ భోజనం వడ్డించింది. ఈ జన్మకు ఇది చాలు అన్నట్టుగా.. జగన్ ఆప్యాయత, ఆథీత్యానికి చిరు ఫిదా అయిపోయారు. అంతేకాదు.. ఇండస్ట్రీలోని సమస్యలన్నీ జగన్ పరిష్కరిస్తా అన్నాడు. ఎవరుపడితే వారు మాట్లాడకండీ. ఓపిక పట్టండని సినిమా వాళ్లకు సూచించాడు. 10 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారనే సంకేతాలు ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉంది. టాలీవుడ్ కి మంచి జరగబోతుంది. కానీ రాజకీయంగా మాత్రం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు డ్యామేజ్ అయిందని చెప్పక తప్పదు. పవన్ మొదటి నుంచి జగన్ కి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. జగన్ సర్కార్ పై పోరాటం చేస్తున్నాడు.
మరోవైపు మెగాస్టార్ మొదటి నుంచి జగన్ కి మద్దతు పలుకుతున్నాడు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ఎటు తేల్చుకోలేని పరిస్థితి. గురువారం జగన్-చిరు భేటీతో మెగా అభిమానుల ముందర పవన్ ని మరీ.. పలచన చేసినట్టయింది. రాజకీయంగా ఇది పవన్ కు మైనస్సే. మరోవైపు, జగన్ తో భేటీలో చిరుకు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారని.. అది పొలిటికల్ ఆఫర్ ని టాక్. అదేంటీ ? అన్నది ముందు ముందు రాజకీయాల్లో వెలుగులోనికి రానుందని సమాచారం.