అలియా.. ఆడేసుకుంటున్నారు !

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కి జంటగా సీత పాత్రలో కనిపించనుంది. కరోనా ఎఫెక్ట్ తో జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలతో ట్రెండ్ లో ఉండటం అలియాకు అలవాటు. తాజాగా ఆమె లెటెస్ట్ పిక్ ఒకటి ట్రెండింగ్ లో ఉంది. ఇందులో లైబరీలో కూర్చున్న అలియా పరధ్యానంలో ఉంది. మనిషిక్కడ.. మనసెక్కడ ? అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.