ఆడవాళ్లు ఏడవద్దు
ఆడవాళ్లు ఎప్పుడూ ఏడవకూడదని టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నారు. తాజాగా ఆయన పూరి మ్యూజింగ్స్ వేదికగా ఆడవాళ్లు ఏడవద్దు అనే భావనతో బాబ్ మార్లే పాడిన పాటకు అసలు అర్థాన్ని వివరించారు.
“పటాయ్‌లో బీచ్ ఒడ్డున రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడుతున్నాడు. రెండు పాటల తర్వాత అతను ‘నో విమెన్ నో క్రై’ అనే పాటను మొదలుపెట్టాడు. ఆ పాట వింటూనే రెస్టారెంట్‌లోని మగవాళ్లంతా అరుపులు, విజిల్స్ వేయడం ప్రారంభించారు. దీంతో రెస్టారెంట్‌లోని ఆడవాళ్లంతా మొహాలు చిన్నబుచ్చుకుని కూర్చున్నారు.
సింగర్ ‘నో విమెన్ నో క్రై’ అన్నప్పుడల్లా రెస్టారెంట్‌లోని మగాళ్లు అతడితో గొంతు కలిపి, అంతకంటే పెద్దగా ‘నో విమెన్ నో క్రై’ అనడం ప్రారంభించారు. కానీ ఈ పాట అసలు భావం ‘నో విమెన్ నో క్రై’ కాదు, ‘నో విమెన్ న క్రై’. అంటే ఆడవాళ్లు ఏడవద్దు అని అర్థం. చాలా మంది ఈ పాట బాబ్ మార్లే రాశాడనుకుంటారు. నిజానికి ఈ పాట రాసింది విన్సెంట్ ఫోర్డ్. విన్సెంట్ ఫోర్ట్ రాసిన లిరిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాబ్ మార్లే ఈ పాట పాడాడు” అని పూరి చెప్పుకొచ్చారు.