ఆచార్య కొత్త రిలీజ్ డేటు

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ కథానాయిక. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఫిబ్రవరిలో రావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో ఫిబ్రవరిలో రావాల్సిన ఈ సినిమాని ఏప్రిల్ కి వాయిదా వేశారు. ఏప్రిల్ 1న ఆచార్య రాబోతున్నాడంటూ చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. 

వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాతే ఆచార్యని విడుదల చేయాలని ఓ రూల్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలోనే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్దడంలో కొరటాలది ప్రత్యేక శైలి. మెగాస్టార్ కోసం అద్భుతమైన కథ-కథనాలతో ఆచార్యని తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది.