సచిన్ రూ. 410 కోట్ల ఆస్తి జప్తు

న‌టుడు, నిర్మాత స‌చిన్ జోషికి ఈడీ షాకిచ్చింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆయ‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది. రూ.410 కోట్ల ఆస్తుల‌ను ఈడీ జప్తు చేసింది. ఇందులో రూ.330 కోట్ల వ‌ర‌కు ఓంకార్ గ్రూప్‌కు చెందిన ఆస్తులు కాగా, మిగిలిన రూ.80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందిన‌వ‌ని ఈడీ వెల్ల‌డించింది.

స‌చిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని వచ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ ద‌ర్యాప్తులో భాగంగా సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసింది.
ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. లోన్‌ ఫ్రాడ్‌ కేసులో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది.

ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.  ఈమేరకు ఔరంగాబాద్‌ సిటీ చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది. సచిన్‌ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. సచిన్ మంచి క్రెకెటర్ కూడా.