పుష్పరాజ్ క్లాస్ టచ్

పుష్పరాజ్ నటనకు బాలీవుడ్ జనాలు పడిపోయారు. సినీ ప్రముఖులైతే బన్నీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రీడా ప్రముఖులు అయితే పుష్పరాజ్ మేనరిజంపై సరదాగా వీడియోలు చేస్తున్నారు. ఒక్కమాటలో ప్రస్తుతం బాలీవుడ్ లో బన్నీ క్రేజ్ మాములుగా లేదు. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు బన్నీ బంపర్ ఫ్లాన్ ఒకటి వేశాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘అల.. వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలు బాలీవుడ్, హాలీవుడ్ ని కూడా తాకాయి. ఇప్పుడీ.. ఈ సినిమాను అర్జెంట్ గా హిందీలోకి డబ్ చేసే పని పెట్టుకున్నాడు ఐకాన్ స్టార్. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులని ఆకట్టుకొనే అంశాలు అల.. లో పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులకు పండగలాంటి సినిమా. టబు కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ జనాలు ఈ సినిమా వైపు చూడ్డానికి ఇవి చాలు.

పుష్పరాజ్ తో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. అల..తో క్లాస్ టచ్ ఇవ్వబోతున్నాడు అన్నమాట. పుష్ప సినిమా చూసిన బాలీవుడ్ జనాలు అల.. వైకుంఠపురంలో బన్నీ స్టయిలీష్ యాక్టింగ్ ని చూసే షాక్ తినడం ఖాయం. ఆపై వచ్చే సినిమాలన్నింటిని అక్కడ రిలీజ్ చేసుకోవచ్చనే సూపర్ ప్లాన్ లో ఈ సూపర్ స్టార్ ఉన్నట్టు కనబడుతుంది. ఈ నెల 26న హిందీ అల.. రాబోతుంది.