హాట్ చాక్లెట్.. పారిస్ మిస్సవుతున్నా

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే త్రో బ్యాక్ పిక్ ఒకటి షేర్ చేసింది. పారిస్ లో అందమైన లొకేషన్ లో దిగిన పిక్ అది. ‘హాట్ చాక్లెట్, మాకరూన్‌లు, కవిత్వం, శరదృతువు రంగులు, చరిత్ర మరియు కవిత్వం… ప్రస్తుతం ప్యారిస్ గురించి అన్నీ మిస్ అవుతున్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అమ్మడి గెటప్ చూస్తుంటే.. అల.. వైకుంఠపురంలో సినిమా సాంగ్ షూట్ సమయంలో తీసుకున్న ఫోటోలా కనిపిస్తున్నది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రంలో పూజా హెగ్డేనే హీరోయిన్. తమిళ్ లో విజయ్ కి జంటగా #Beast సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ బిజీ బిజీ. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుంది.