తారక్.. టీడీపీని టేకప్ చేసినట్టేనా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకు ఆమడ దూరం ఉంటున్నారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న తర్వాత.. అందరూ స్పందించారు.. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు.
అయితే కర్ర విరగకుండా .. పాము చావకుండా స్పందించారు. దీనిపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేసిన తారక్ పట్టించుకోలేదు. తనకు రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టుగా కామ్ గా ఉండిపోయారు. అలాంటి తారక్.. మామయ్య చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరలో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ పుట్టిన రోజలకు కూడా విష్ చేస్తూ ట్వీట్లు పెట్టిన దాఖలాలు లేవు. అలాంటి తారక్ లో ఉన్నట్టుండి ఫ్యామిలీ ప్రేమ పొంగిపోయినట్టుంది. ఆయన త్వరలోనే టీడీపీ ని టేకప్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ? అనే చర్చ మొదలైంది.