ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వర్మ పైత్యం

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-సౌందర్య తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. కూల్ & కామ్ గా విడాకుల ప్రకటన చేశారు. ఈ న్యూస్ విని కోలీవుడ్, ప్రేక్షకులు షాక్ లో ఉన్నారు. బ్రేకప్ కు కారణాలు ఏమై ఉంటాయనే కూపీ లాగే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో తెరమీదకు వచ్చిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వరుస ట్వీట్లతో షాక్ ఇస్తున్నారు.

“పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అలాగే  ‘సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంత వరకూ ప్రేమించడం ఉత్తమం’, ‘స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు’ అంటూ పేలిపోయే పంచ్‌లు విసిరాడు. అస‌లే వివాహ బంధానికి వ్య‌తిరేకి అయిన వ‌ర్మ‌కు… సెల‌బ్రిటీల విడాకులు ఓ పెద్ద ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. పెళ్లిళ్ల‌ను కాకుండా, విడాకుల‌ను సెల‌బ్రేట్ చేసుకోవాల‌నేది ఆయ‌న ఫిలాస‌ఫీ.