అందాల రాక్షిసి ప్రేమలో మెగా హీరో ?
టాలీవుడ్ లో బర్నింగ్ గాసిప్ ఒకటి పుట్టుకొచ్చింది. బర్త్ డే బాయ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాదాపు పాతిక లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకుని బెంగళూరు బయల్దేరి వెళ్లారని, అక్కడ ఓ హీరోయిన్ కు పెళ్లి ప్రపోజ్ చేయబోతున్నారన్నది ఆ గ్యాసిప్. ఆ హీరోయిన్ అందాల రాక్షిసి లావణ్య త్రిపాఠి అని అంటున్నారు.
ఈ ఇద్దరు కలసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం లావణ్య బిజీ హీరోయిన్ కాకపోయినా వరుణ్ మాత్రం ఫుల్ లైనప్ తో వున్నారు. మరోవైపు లావణ్య విషయంలో ఎప్పుడూ తప్పుడు ప్రచారం జరగలేదు. ఆమెతో ఎవరితోనూ పెద్దగా లింకులు పెట్టి కథనాలు రాలేదు. ఈ గాసిప్ నిజమైతే.. అందాల రాక్షిసికి మెగా హీరో పడిపోయినట్టే. ఈ ఏడాదియే వీరి పెళ్లి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.