పాత-కొత్త రికార్డులను బ్రేక్ చేసిన అఖండ

50 రోజులు, 100 రోజులు సినిమాలు ఆడే  కాలం పోయింది. ఇప్పుడంతా.. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే ఫలితం తేలిపోతుంది. ఇలాంటి టైమ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ పాత-కొత్త రికార్డులను కలిపి బద్దలుకొట్టడం విశేషం.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం అఖండ. గత ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకొచ్చి అఖండ విజయాని నమోదు చేసింది. నేటితో అఖండ 50రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా 103 థియేటర్స్ లో 50 రోజుల పండగ జరుపుకోవడం విశేషం. మొత్తం కలెక్షన్స్ రూ. 200కోట్లు దాటిపోయాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పాత రోజుల్లో రికార్డులని గుర్తు చేస్తూనే.. ఈరోజుల్లో లెక్కలోనికి తీసుకుంటున్న వందల కోట్ల కలెక్షన్స్ ని అఖండ సాధించడం గొప్ప విశేషం. అందుకే బాలయ్యను ఆ తరం, ఈ తరానికి వారధిగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.