Gehraiyaan ట్రైలర్ టాక్

శకున్ బట్రా దర్శకత్వంలో దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘గెహ్రైయాన్’ (Gehraiyaan). ఫిబ్రవరి 11న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.  Relationship, Complications, Love, Sex అన్నింటినీ ట్రైలర్ లో టచ్ చేశారు.

లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ లో దీపికా, అనన్య పోటీపడి మరీ నటించారు. ప్రత్యేకంగా దీపికా పదుకొనె తన అనుభవాన్ని అంతా చూపించింది. సినిమాలో వాటిని పీక్స్ లో చూపించబోతున్నారు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.