కోటు వేసినా.. తీసినా చూపిస్తా !

రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ వాటినే నమ్ముకుంది. వేటిని అని ప్రత్యేకంగా అడగకండీ. నిండైన అందాలు ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా.. వాటిని ఆరబోస్తుంటుంది. నిండుగా దుస్తులు ధరించినా.. వంగి వంగి వడ్డిస్తుంటుంది. పైన కోటు వేసుకున్నా.. తీసినా పై అందాలను విందుగా వడ్డిస్తుంటుంది. లెటెస్ట్ ఫోటో షూట్ లోనూ ఈ ముద్దుగుమ్మ అదే చేసింది.

పూరి కొడుకు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.. ఈ బ్యూటీ. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఏకంగా అరడజను సినిమాల ఆఫర్లు కొట్టేసింది.

ఇప్పటికే ఆమె నటించిన రెండో సినిమా లక్ష్యం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమాలో కేతిక నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
