వరుణ్ తేజ్ తో ప్రేమ.. పెళ్లి క్లారిటీ ఇచ్చిన త్రిపాఠి !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడు. గురువారం అతడి బర్త్ డే సందర్భంగా బెంగళూరుకి వెళ్లి విలువైన డైమైండ్ రింగ్ ఇచ్చి ఆమెకి ప్రపోజ్ చేశాడనే గాసిప్ ఒకటి వైరల్ అయింది. అంతేకాదు.. వీరిద్దరికి సీక్రెట్ గా మ్యారేజ్ కూడా అయిందనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా.. ఈ ప్రచారంపై లావణ్య త్రిపాఠి స్పందించారు. పుకార్లకు ఫొటోలతో సమాధానమిచ్చింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.

ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పింది. దీంతో బుధవారం ఉదయం నుంచి వస్తున్న పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది. వరుణ్‌తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని ఫొటోల వల్లే ఇదంతా జరిగింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా చేసిన ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య అందరూ చెవులు కొరుక్కున్నారు. అంతేకాకుండా వరుణ్‌ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరైంది. దీంతో ఆ వార్తలకు మరింత బలం వచ్చింది. ఆ ప్రచారం కాస్త ప్రేమ.. ప్రపొజల్.. పెళ్లి వరకు వెళ్లింది.