అనన్య గ్రీన్ అందాలు

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హీటెక్కిస్తోంది. మొన్ననే పూల కలర్ బికినీలో రెచ్చిపోయింది. పువ్వుల విరబూసి అందాలను ఆరబోసింది.

తాజాగా మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. పైన వేసుకున్న జాకెట్ వేసుకున్నట్టు లేదు. చుట్టుకున్నట్టు ఉంది. ఎద అందాలను హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. అదే టైమ్ లో ట్రెండింగ్ గా కనిపించింది.

ప్రస్తుతం అనన్య లైగర్ సినిమాతో పాటు ‘గెహ్రైయాన్’ (Gehraiyaan) చిత్రంలో నటిస్తుంది. ఇదో రొమాంటిక్ డ్రామా. శకున్ బట్రా దర్శకత్వం వహిస్తున్నారు.దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఇందులో అనన్య దీపికా పదుకొనెతో పోటీ పడితూ.. రొమాన్స్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక లైగర్ లో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండతో అనన్య రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. పాన్ ఇండియా సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

