అక్షర్ పటేల్ ఎంగేజ్ మెంట్ పిక్స్

టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలు మేహాను పెళ్లాడనున్నాడు. గురువారం అక్షర్ పుట్టినరోజు.. అదే రోజున మేహాతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సహచరుడు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలతో ఇన్‌స్టాగ్రామ్‌ను మోతెక్కించారు.

అక్షర్ పటేల్ మంచి స్పిన్నర్ మాత్రమే కాదు. మంచి బ్యాట్స్ మెన్ కూడా. బ్యాట్ తోనూ తనవంతు సహకారం అందించగలడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అక్షర్ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అశ్విన్, జడేజాల తర్వాత టీమిండియాకు గల బెస్ట్ ఆప్షన్లలో అక్షర్ ఒకరుగా మారారు.
