50 మిలియన్ కిస్సెస్

బాలీవుడ్ హాట్ బ్యూటీగా మారిన శృంగార తార సన్నీ లియోన్ తన ఫాలో వర్స్ ని ముద్దుల్లో ముంచెత్తెంది. సన్నీకి అంతగా మూడ్ రావడానికి కారణం ఏంటీ అనుకుంటున్నారా ? తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 50 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ ఆనందంలో స్పెషల్ వీడియో ద్వారా అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన హాట్ బ్యూటీ.. 50 మిలియన్ కిస్సెస్, హగ్స్.. అంటూ హీటెక్కించింది. ప్రస్తుతం ఈ వీడియోని ఆమె అభిమానులు తెగ ఆస్వాదిస్తున్నారు. తమకో ముద్దు దక్కిందని ఆనందపడుతున్నారు.

అయితే 50 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం మామూలు విషయం కాదు.  ఈ రికార్డ్ చూస్తే సన్నీకి గ్లామర్ ఫీల్డ్ లో ఎంత పాపులారిటీ ఉందో తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన అందాలను విందు చేస్తున్న సన్నీ 50 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ కావడంతో చాలా ఆనందం వ్యక్తం చేసింది. ఇక సినిమాలు ఉన్నా.. లేకున్నా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరించడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నుంచి నాన్ స్టాప్ గా సన్నీ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. 

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)