అమ్మాయి డాక్టర్, అబ్బాయ్ డైరెక్టర్

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు-కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్తా. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ లో సుధీర్ బాబు డైరెక్టర్ గా కనిపించారు. కృతిశెట్టి డాక్టర్ గా కనిపించింది. ఆమెకు సినిమాలంటే అస్సలు నచ్చవు. అలాంటి అమ్మాయినే పెట్టి సినిమా తీసే ప్రయత్నం చేశాడు సుధీర్ బాబు. అమ్మాయి కూడా ఒప్పేసుకుంది. కానీ ఓ కండిషన్ పెట్టింది. అదేంటీ ? తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

ఇక ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్ వ్యవహరిస్తోంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.