అల.. హిందీ రిలీజ్ క్యాన్సిల్.. డైరెక్ట్ గా టీవీలోనే !

‘పుష్ప’తో బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేశాడు అల్లు అర్జున్. ఇదే ఊపులో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాని హిందీలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

రిలీజ్ డేటు జనవరి 26గా ఫిక్స్ చేశారు. డబ్బింగ్ పనులు కూడా ఆ టైమ్ కు పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయడంపై వెనకడుగు వేశారు. అల.. హిందీ డబ్బింగ్ రైట్స్ ని తీసుకున్న గోల్డ్ మైన్స్ వారు తమ ఢించాక్ టీవీలో ఫిబ్రవరి 6నుండి హిందీ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీంతో.. రికార్డ్ టీఆర్పీ రేటింగ్ లోడింగ్ అంటూ.. బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురములో’. 2020 లో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈసినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించింది. టబు, సముద్రఖని సునీల్, సుశాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. హారిక & హాసినీ క్రియేషన్స్ నిర్మించింది.