చై-సామ్ విడాకులు.. ఏమైనా జరగొచ్చు.. నాగ్ స్పందన

టాలీవుడ్ ఆదర్శ దంపతులు గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఎవ్వరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ చేసిన చైతూ..’బంగార్రాజు’ సినిమాని పూర్తి చేశారు. రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తొలిసారి సామ్ తో బ్రేకప్ పై స్పందించారు. అది మంచి డిసిషన్. విడిపోయి ఇద్దరం హ్యాపీగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

సామ్ మాత్రం ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. అంతేకాదు.. ఇటీవల తన ఇన్ స్టా గ్రామ్ నుంచి విడాకుల ప్రకటనని కూడా డిలీజ్ చేసింది. దీంతో చై-సామ్ మళ్లీ ఒక్కటికాబోతున్నారా ? అనే ఆశలు అక్కినేని అభిమానుల్లో చిగురిస్తున్నాయి. మరోవైపు చై-సామ్ విడాకులపై ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

“చై-సామ్ విడాకుల తర్వాత దానికి కారణాలు ఇవే అంటూ… కొంత మంది  కావాల‌నే  చెత్త వార్త‌లు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌కు వేదిక‌గా మారుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నేను ప‌ట్టించుకోను. పండ్లు ఉన్న చెట్టుకు రాళ్ల‌నే విష‌యాన్ని బ‌లంగా న‌మ్ముతాను. అందుకే నా గురించి జ‌రిగే ప్ర‌చారాల‌పై స్పందించ‌ను. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం, న‌న్ను ఎంతో బాధించింది’’ అంటూ నాగార్జున ఎమోష‌న‌ల్ అయ్యారు.